దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగి నెలన్నర దాటుతున్నా.. దీనిపై దర్యాప్తు చేస్తున్న సంస్థలు ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్టులు ప్రభుత్వాలకు సమర్పించలేదు. దీంతో ఈ ప్రమాదం వెనక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాలోనూ ఇలాంటి కథనాలే వస్తుండటంతో అన్ని పార్టీలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయి దాదాపు రెండు నెలలు అవుతున్నా, దీనిపై విచారణ చేపట్టిన సంస్థలు ఎలాంటి రిపోర్టులు, నివేదికలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయలేదు. దీంతో ఈ ప్రమాదం వెనక ఏదైనా కుట్ర ఉందా, అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అనుమానాలతోనే మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఇవి అధికార కాంగ్రెస్ తోపాటు మిగతా పార్టీల్లోనూ కలకలం రేపుతున్నాయి.
ఈ కథనాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని స్వయంగా ఏఐసీసీ అధికార ప్రతినిధి కే.కేశవరావు అంగీకరిస్తున్నారు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి అనుమానాలను నివృత్తి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర మాజీ హోంమంత్రి జానారెడ్డి కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ప్రమాదం గురించిన వాస్తవాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలని ఆయన సూచించారు.
ఇతర పార్టీలు కూడా అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతున్నాయి. అధికార పార్టీ నాయకులే వైఎస్ మరణంలో కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు సాధారణ ప్రజలకు కూడా ఈ అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని బిజెపి పార్టీ సీనియర్ నేత సిహెచ్.విద్యాసాగర్ రావు అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రోశయ్య వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం విద్రోహ చర్యేననే వాదన కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వ్యవహారమని సిపిఐ ఆరోపిస్తోంది. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న సంస్థలు ఇప్పటి వరకు సరైన నివేదికలను ప్రభుత్వాలకు సమర్పించకపోవడం ఈ గందరగోళానికి దారితీస్తోంది. ఇప్పటికైనా ఈ సంస్థలు తమ విచారణను వేగవంతం చేసి ప్రమాదంపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.
Watch Video
View Video
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment