- కామాంధుని రాక్షసత్వానికి అమాయకురాలి బతుకు ఛిద్రం
- బంధువులే రాబంధులయ్యారు
- మోసం చేసిన వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్న వైనం
ఖమ్మం జిల్లా: మానవ మృగం చేతిలో ఓ యువతి బలైంది. కామాందుని రాక్షస చర్యకు సజీవ సాక్ష్యంగా నిలిచింది ఓ అబల... తన బంధువులే అభం శుభం ఎరుగని అభాగ్యురాలి బ్రతుకును ఛిద్రం చేశారు. రాక్షసత్వానికి బలై మతిస్థిమితం కోల్పోయిన కూతుర్ని చూసుకుంటూ బతుకీడుస్తోంది ముసలి తల్లి.
ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని బాబుక్యాంపుకు చెందిన కృష్ణవేణి 12 యేళ్ళక్రితం అత్యాచారానికి గురైంది. ఈ దురాగతానికి పాల్పడింది సమీపబంధువులే. దీంతో ఆమె మతిస్థిమితం కోల్పోయింది. ఇక తండ్రి కూడా చిన్నతనంలోనే మరణించాడు. తండ్రి ఉద్యోగం వచ్చిన సోదరుడు పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. దీంతో మానసికంగా చితికిపోయిన కృష్ణవేణి బాగోగులంతా వయస్సు మీద పడిన తల్లి చంద్రమ్మే చూసుకుంటోంది.
తనకు అన్యాయం జరిగిన ప్రదేశాన్ని మరిచిపోని కృష్ణవేణి అక్కడికి వెళ్లి ఏదో వెతుకుతుంది. తన కూతురు ఏమైపోతోందోనన్న భయంతో ఆ తల్లి బిడ్డను గోలుసుతో కట్టేసి తన నడుముకు కట్టుకుంది. మోసం చేసిన బందువులు మాత్రం కొద్దిరోజులు జైల్లో వుండి ఇప్పుడు నిర్బయంగా బయట తిరుగుతున్నారని, కోర్టుల చుట్టూ తిప్పుతున్నావంటూ ఇంటికొచ్చి బెదిరిస్తున్నారని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
నిత్యం కంటికిరెప్పలా కూతుర్ని చూసుకుంటూ, దాతల సహాయంతోనే చంద్రమ్మ కాలం వెళ్లదీస్తోందని స్థానికులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఏదైనా స్వచ్చంద సంస్థగాని, లేదా ప్రభుత్వంగా తమకు చేయూత నందించాలని ఆ దీన మాతృమూర్తి కోరుతోంది.
Watch Video
View Video
0 comments:
Post a Comment