యుక్త వయస్కులలో ఉండే సాధారణమైన అనుమానం, హస్తప్రయోగం కారణంగా తాము బలహీనమైపోతామనీ, ఫలితంగా ఎదుగుదల ఆగిపోతుందన్నది. అంతేకాదు వివాహమైన అనంతరం హస్తప్రయోగం ప్రభావం సెక్స్ జీవితంపై పడి రతిని పూర్తి స్థాయిలో చేయలేమోనన్న శంక చాలామందిని పీడిస్తుంటుంది. అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే.
అసలు హస్తప్రయోగం చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది...? దానికి కారణం ఏమిటి..? అని చూస్తే... మనసులో లైంగిక భావనలు ఏర్పడుతున్నాయని తెలుస్తుంది. ఎప్పుడు.. ఎందువల్ల ఈ లైంగిక భావనలు ఏర్పడుతున్నాయి అని చూస్తే... యుక్త వయస్సులోకి అడుగిడినప్పుడు ఇవి తొంగి చూస్తాయి. ఈ వయసులోకి ప్రవేశించిన వారిలో శరీరంలోని ఆండ్రోజన్ అనే హార్మోను విడుదలవుతుంది. ఇదే హార్మోను మనిషి ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. అందువల్లనే చాలామంది హస్తప్రయోగం చేసుకుంటే పొడుగు ఎదగరని భావిస్తుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహ మాత్రమే. హస్తప్రయోగం వల్ల ఎటువంటి నష్టం కలుగదని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. అదేవిధంగా ఫాంటసీ సెక్స్ సైతం ఇదే కోవకు చెందుతుంది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment