హన్సిక వెనకడుగు వేసింది. అల్లు అర్జున్ సరసన 'వేదం' సినిమాలో నటించేందుకు తొలుత సూత్రప్రాయంగా అంగీకరించిన ఈ భామ ఇప్పుడు సైన్ చేసేందుకు ఒప్పుకోవడం లేదట. తన పాత్ర చిన్నది కావడం, పారితోషికం కూడా తక్కువే కావడంతో, హన్సిక చివరికి సినిమాలో నటించేందుకు నిరాకరించిందని సమాచారం. ప్రస్తుతం హన్సికా తెలుగులో నటిస్తున్న సినిమా ఒక్కటే - నితిన్ హీరోగా రూపొందుతున్న 'సీతారాముల కళ్యాణం'.
0 comments:
Post a Comment