ప్రేమను వ్యక్తం చేయడంలో పలు రకాలను కవులు, రచయితలు కాగితాలపై పెడితే దర్శకులు వెండితెరపై చూపించారు. అటువంటి ప్రేమను వ్యక్తం చేయడంలో ఆరు రకాల చాఫ్టర్లున్నాయని ప్రేమతో ఒకటైన సూర్యకిరణ్ దంపతులు అంటున్నారు. ఇద్దరికీ ప్రేమానుభవం ఉంది కనుక సబ్జెక్ట్‌ను బాగా డీల్ చేయగలరని అందుకే 'చాప్టర్-6' అనే పేరు పెట్టారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కళ్యాణి నిర్మాతగా సూర్యకిరణ్ దర్శకత్వంలో బాల, సోనియా సూరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి తాజ్‌బంజారాలో జరిగింది. ముఖ్య అతిథి డా|| దాసరి నారాయణరావు ఆడియోను ఆవిష్కరించి వెంకటేష్‌కు అందజేశారు. సీడీని రాజశేఖర్ ఆవిష్కరించి జగపతిబాబుకు ఇచ్చారు.
0 comments:
Post a Comment