| ||||
ఇక అరటిరైతులకు మంచి రోజులోచ్చాయి. విదేశాల్లో అరటిపంటకు మంచి డిమాండ్ ఉందని ఉద్యానవనశాఖ గుర్తించింది. కడపజిల్లాలో అత్యధికంగా సాగవుతున్న అరటిపంటను విదేశాలకు ఎగుమతిచేసేవిధంగా అధికారుల రైతుల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కడపజిల్లాలో అరటిపంటను రైతుల అధికంగా సాగుచేస్తున్నారు. జిల్లాలోని పులివెందుల, లింగాల, వేంపల్లి, వేముల, కమలాపురం, మైదుకూరు పాటు మరికొన్ని ప్రాంతాల్లో సుమారు 10వేల హెక్టార్లలో అరటి సాగవుతోంది. ఇప్పటికే పులివెందుల నుంచి కాశ్మీరు వంటి ప్రాంతాలకు కూడా అరటి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అయితే జిల్లాలో అరటి ఉత్పత్తుల సాగును దృష్టిలో పెట్టుకుని ఉద్యానవనశాఖ అధికారుల అరటిని విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేయించేవిధంగా చర్యలు ప్రారంభించింది. అపెక్స్ అనే సంస్థ సహకారం అందిస్తోంది. విదేశాలకు అరటి ఎగుమతిపై రైతుల్లో అవగాహన కల్పించేవిధంగా వర్క్‌షాపులు ఏర్పాటు చేసింది. ప్యాకింగ్, కాయ నాణ్యతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగ్ వంటి అంశాలలో రైతులకు అవగాహన కల్పించేవిధంగా వర్క్‌షాపులు ఉపయోగపడుతున్నాయి. విదేశీ మార్కెట్‌లో అరటికి మంచి డిమాండ్ వుందని రైతులందరూ ఈ అవకాశం సద్వినియెగం చేసుకుంటార్నన్న నమ్మకాన్ని ఉద్యానవన శాఖ అధికారుల వ్యక్తం చేస్తున్నారు. |
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment