| ||||
సాధన వుంటే సాధించలేనిది ఏది వుండదు....శిక్షణ తీసుకుంటే ఎంతటి కఠిన పరీక్షలోనైనా విజయం సాధించ వచ్చు...అయితే...ఇవేమీ లేకుండా ఓ చిన్నారి అద్భుత జల విన్యాసాలు చేస్తోంది. ఆ జలకన్య కధా కమామీషు ఏమిటో తెలుసుకోవాలంటే నంద్యాల వెళ్లాల్సిందే. మత్స్యకన్యలు వున్నాయో లేదు తెలియదు కాని, ఈ చిన్నారి చేస్తున్న జలవిన్యాసాలు మాత్రం చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కర్నూల్ జిల్లా నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ పోలీస్‌గా పనిచేస్తున్న మల్లేష్ కుమార్తె తేజస్విని ఏడో తరగతి చదువుతోంది. పది రోజుల క్రితం కుటుంబంతో సహా మహానందికి వెళ్లిన మల్లేష్...కుమార్తెను అక్కడి కోనేటిలో దించాడు. ఆ రోజు నుంచి తేజస్విని ఈతలోనే కాక నీటిలో అద్భుత విన్యాసాలు చేయడంలోను మేటిగా తయారైంది. జలక్రీడా నిపుణులతో తమ కుమార్తెకు శిక్షణ ఇప్పిస్తే జలవిన్యాసాల్లో దేశానికే పేరు తేగలదని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు. Watch Video |
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment